కేంద్రాన్నీ ముంచాలనుకుంటున్నారా.. చంద్రబాబుపై వైసీపీ ఎంపీ సెటైర్లు

ట్విట్టర్ వేదికగా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి టార్గెట్ చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ చంద్రబాబుకు లేఖ రాసిన అంశాన్ని ప్రస్తావిస్తూ సెటైర్లు పేల్చారు. బాబు తన సలహాలతో కేంద్రాన్ని కూడా ముంచే ప్రయత్నం చేస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డి తన ట్వీట్‌లో ‘PMOకు మీరు రాసిన లేఖ అందింది. ప్రస్తావించిన అంశాలను పరిశీలించాల్సిందిగా నా సహచరులను కోరతానంటూ నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాసిన జవాబును ప్రదర్శించే దౌర్భాగ్యం ఏమిటీ బాబూ? ఎవరు రాసినా వాళ్లిలాగే ప్రశంసాపూర్వక వ్యాఖ్యలు చేస్తారు. నాకు రిప్లై ఇచ్చారహో అని మొత్తుకున్నట్టుగా ఉంది’అన్నారు.