కరోనా ప్రభావంతో సన్న ,చిన్న ,మద్యతరగతి కుటుంబాలు కుదేలవుతున్నాయి .దాదాపుగా సగం మంది జనం శ్రమనే పెట్టుబడిగా జీవనం సాగించే
పరిస్తితి .రెక్కాడితేనే డొక్కాడని పరిస్తితి .ఇళ్లలోనుంచి
వెలుపలికి వచ్చే పరిస్తితి లేకపోవడంతో వీళ్లపరిస్థితి
బ్రతుకు భారంగా మారింది .చిరు వ్యాపారస్తుల పరిస్తితి కడు దయనీయంగా మారింది . ప్రభుత్వం ఈ నెల 29 న ఉచిత రేషన్తోపాటు వేయి రూపాయలు ఇవ్వనుంది .అయినా రోజువారీ కూలి పనులు చేసుకొని బ్రతుకు బండిని లాగే వారికి అవి ఎంతమాత్రం సరిపోని పరిస్తితి .కరోనా తో నిత్యావసర
వస్తువుల ధరలతోపాటు ,కూరగాయల ధరలు బాగా
పెరిగిపోయాయి .ధరలను అదుపుచేస్తామని అధికారులు ప్రకటిస్తున్నా అవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయి .చేతిలో చిల్లిగవ్వ లేక ,అప్పు
ఇచ్చే వాళ్లు లేక పేదప్రజలు నలిగిపోతున్నారు .ఏప్రిల్ 14 వరకు అప్పటికి లాక్ డౌన్ ప్రకటించి 21 రోజులు పూర్తవుతుంది .ఇన్ని రోజులు కుటుంబ బండిని లాక్కరావడం తలప్రాణం ,తోకకు వచ్చేపరిస్థితి .ఆ తరువాత కూడా లాక్ డౌన్ మరింత పొడిగిస్తే సన్న ,చిన్న ,మద్యతరగతి ప్రజల పరిస్తితి కడుదయనీయంగా మారనుంది .వీరిపట్ల ప్రభుత్వాలు ఉదారంగా ఆలోచించాల్చిన అవసరం ఎంతైనా ఉంది . కింగ్ మోహన్ కుమార్ జర్నలిస్ట్
కుదేలవుతున్న సన్న ,చిన్న ,మద్యతరగతి " కుటుంబాలు;